Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిరసిస్తూ మంగళవారం అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు మెడలో నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టారు. 'చైర్పర్సన్ హాఠావో-మేడ్చల్ బచావో, వద్దరా నాయన అవినీతి పాలన' అని నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైటాయించి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు తమ వార్డులు నోచుకోవడం లేదన్నారు. మున్సిపల్‌కు వచ్చిన ఆదాయాన్ని చైర్పర్సన్, కమిషనర్ పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై జిల్లా అదనపు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ప్రతి సమావేశ తీర్మానంలో ప్రశ్నిస్తున్న వారి తీరు మారటం లేదని, వారు ఇష్టారాజ్యంగా ఏక పక్ష దోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కౌడే మహేష్ కురుమ, జాకట దేవ, తుడుం గణేష్, పెంజర్ల స్వామి యాదవ్, సముద్రం సాయి కుమార్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, జంగా హరికృష్ణ యాదవ్, అర్చన సందీప్ గౌడ్, నారెడ్డి కృష్ణవేణి రవీందర్ రెడ్డి, సాటే మాధవి నరేందర్ వంజరి, బత్తుల ప్రియాంక మధుకర్ యాదవ్, వీరమల్ల మానస శ్రావణ్ కుమార్ గుప్తా, ఉమా నాగరాజు పాల్గొన్నారు.