Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్ పేట
డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని అంబర్ పేట ప్రధాన రహదారి మహంకాళి అమ్మవారి ఆలయం వీధిలో డ్రయినేజీ పొంగి ప్రవహిస్తుందనీ, కలుషిత మంచినీరు సరఫరా అవుతుంది అని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కార్పొరేటర్ వాటర్ వర్క్స్ మేనేజర్ మాజీద్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, డ్రయినేజీ సూపర్వైజర్ లక్ష్మణ్‌తో కలిసి పరిశీలించి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే డ్ర్రయినేజీ వర్షపు నీటి కాలువ మంచినీటి పైపులైన్ల పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ, వెంటనే పూర్తి అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. మహంకాళి అమ్మవారి పక్క వీధిలో డ్రయినేజీ సమస్య, కలుషిత మంచినీటి సమస్య, వర్షపు నీటి కాలువ సమస్యలు మాటిమాటికి రాకుండా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శి జమ్మి చెట్టు బాలరాజ్, మిరియాల శ్రీనివాస్, బాలకృష్ణ గౌడ్, పృథ్వీగౌడ్, సాయినాథ్ గౌడ్, రామ్ రెడ్డి, పాండు, తదితరులు పాల్గొన్నారు.