Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్ పేట్
ఆసియా ఖండంలోనే తొలి మహిళా ఉత్తమ ఉపాధ్యాయినిగా, సంఘ సంస్కర్తగా సావిత్రీబాయి ఫూలే చేసిన సేవలు మరువలేనివని సహాయ ఆచార్యు లు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, డాక్టర్.బి.సుదక్షణ అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాలలో సావిత్రీబాయి ఫూలే 192వ జయంతి సందర్భంగా కళాశాల గ్రంథా లయంలో సామాజిక శాస్త్ర విభాగాలు ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విప్లవ దత్ శుక్లా, ఐజాజ్ సుల్తానా, డాక్టర్ శంకర్ కుమార్, డాక్టర్ సీహెచ్.రవికుమార్, డాక్టర్.జె.నీరజ, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ డి.శ్రీనివాస్, లతారాణి పాల్గొన్నారు.
హిమాయత్ నగర్ : భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబా యి పూలే అని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంగళవారం నిజాం కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత కుమార్, నిజాం కాలేజ్ ఇన్చార్జి శోభన్ బాబు, మేకల సందీప్, నాయకులు, విద్యార్థులు బుచ్చు చందు, సునీల్, ఉమేష్, సాత్విక్, తదితరులు పాల్గొన్నారు.
ధూల్ పేట్ : సావిత్రిబాయి పూలే 191వ జయంతి వేడుకలను గోషామహల్ నియోజకవర్గం చుడీ బజార్ డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ లోహియా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ఆర్.సుమన్ కుమార్, నాగరాజు, నందీష్, వెంకటేష్, రాజు, అబ్బయ్య పాల్గొన్నారు.
హిమాయత్ నగర్ : ఆధునిక భారతదేశంలో మహి ళల స్థితిగతులను మార్చాలని సంకల్పించిన మొదటి మహిళా సావిత్రి బాయి ఫూలే అని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు ఎస్.ఛాయాదేవి, అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లాV్‌ా ఖాద్రి, కె.ధర్మేంద్రలు కొనియాడారు. మంగళవారం హిమాయత్ నగర్ లోని సత్యనారాయ ణరెడ్డి భవన్ వద్ద పూలే 192వ జయంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పలువురు నేతలు ఫూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడ బ్ల్యూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని, మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు జె.లక్ష్మి, ఏఐవైఎఫ్ హైదరా బాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నేర్లకంటి శ్రీకాంత్, ఏఐటీయూసీ నేత జ్యోతి శ్రీమాన్, ఏఐఎస్ఎఫ్ నేతలు కంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అడిక్‌మెట్ : పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి మహిళలపై జరిగే ఆకృత్యాలను అరికట్టాలి అని బీసీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. విద్యానగర్ లోని బీసీ భవన్లో బీసీ మహిళా నాయకులు సావిత్రి బాయి పూలే జయంతిని నిర్వమించారు. ఈ సంద ర్భంగా పూలే చిత్రపటానికి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు లు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిల్లా దీపిక, గడ్డమీద అనురాధ గౌడ్, తీరా, స్వరూపా, వాణి రెడ్డి, నిర్మలా, జ్యోతి, ప్రేమలత, శ్రీ దేవి, సునంద, మంజు లత పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ : సావిత్రిబాయి పూలే 192వ జయంతిని ఎర్రగడ్డ డివిజన్, ఓల్డ్ సుల్తాన్‌నగర్, బాల జ్యోతి స్కూల్లో నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయ కులు, తెలంగాణ రాష్ట్ర దళిత సేనా రాష్ట్ర అధ్యక్షులు గంటా మల్లేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దాసిరాజు, మహమ్మద్ సర్దార్, సి.నర్సింగ్ రావు, తెలంగాణ రాష్ట్ర దళిత సేన ఓబీసీ అధ్యక్షులు, వేముల యాదయ్య, కె.ఆనంద్ కుమార్, ఎస్ఎన్ఎం.పాషా, గొలుసుల ఎల్లయ్య, గంట శ్రీనివాస్, రొంపి.ప్రభాకర్, ధారా సింగ్, వజ్రాల సత్యనారాయణ పాల్గొన్నారు.
అడిక్‌మెట్ : స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయు లను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. పాఠశాలలో చిన్నారులకు అనుకోని ఏమైనా ప్రమాదాలు జరిగినప్పు డు ఉపయోగాడేలా ఎమర్జెన్సీ మెడికల్ కిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ వై.సంజీవ కుమార్, సభ్యులు పి.కోటేశ్వర్ రావు పాల్గొన్నారు.
అడిక్‌మెట్ : పూలే జయంతి సందర్భంగా చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్.