Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్పరిధిలో అసంపూర్తిగా వదలి వేసిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని బీజేవైఎం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్.రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్ధనీటి కాలువ నిర్మాణం కోసం 2022 జనవరి 29న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. 29వ, 23, 22,20, 1వ డివిజన్ సంబంధించిన కాలనీలలో అక్కడక్కడ పనులు ప్రారంభించి అర్ధాంతరంగా ఆ పనులను వదిలేసి సంవత్సరం గడుస్తుందని తెలిపారు. ఆ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్లు, మంత్రి సబితారెడ్డి పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యలో వదిలేసిన పనులను పున ప్రారంభించాలని కోరుతూ కమిషనర్‌కు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు వినతిపత్రం అందజేసిన పట్టించుకోవటం లేదని అవేదన వ్యక్తం చేశారు. దీంతో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టిపెట్టి అతిత్వరలో ఎస్ఎన్డీపీ పనులను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కో కన్వీనర్ నడికుడ యాదగిరి, చంద్రపాల్ రెడ్డి, కార్పొరేటర్లు గౌరా రమాదేవి శ్రీనివాస్, పద్మ ఐలయ్య, సీనియర్ నాయకులు మర్రి అంజి రెడ్డి, మంత్రి మహేష్, నిమ్మల రవికాంత్ గౌడ్, నర్సింగ్ యాదవ్ బీజేవైఎం నాయకులు అరవింద్, సోను, నిశికాంత్ రెడ్డి, రాహుల్, శ్రీకృత్, భరత్, భువన చంద్ర, నితిన్ రెడ్డి, శ్రీకంఠ, పద్మ, చిట్టెమ్మ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.