Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల వ్యవహారం
- మంత్రి మల్లారెడ్డికి తలనొప్పిగా మారిందా?
- అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల విమర్శలతో ఇతర పార్టీ నాయకుల రాజకీయ ఎత్తుగడ
నవతెలంగాణ- మేడ్చల్
మేడ్చల్ పురపాలక సంఘంలో చైర్పర్సన్ ఒకవైపు కౌన్సిలర్లు మరోవైపు ఉండడంతో రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయని పురపాలక సంఘం సహా మండలంలోని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా చూసుకున్న పలు ఇతర రాజకీయ పార్టీల నాయకులు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ నాయకులే తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
ఫ్లెక్సీ లొల్లి : మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రధాన చౌరస్తాపై నూతన సంవత్సర, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక కౌన్సిలర్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో చైర్ పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి రెడ్డి ఫోటో లేకపోవడంతో పట్టణ ప్రజలతోపాటు మండల ప్రజలను షాక్కు గురిచేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం సన్నగిల్లుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందుకు మూల కారణం అధికార పార్టీ కౌన్సిలర్లేని పట్టణ ప్రజలు అంటున్నారు.
మంత్రి మల్లారెడ్డికి తలనొప్పిగా మారిన మేడ్చల్ కౌన్సిలర్లు..!
మేడ్చల్ పురపాలిక సంఘంను అభివృద్ధి చేయాల్సింది పోయి అధికార పార్టీ కౌన్సిలర్లు ఒక వర్గంగా ఏర్పడి వారు ఎన్నుకున్న చైర్పర్సన్నే విస్మరిస్తున్నారని స్థానిక ప్రజలు వారిపై మండిపడు తున్నారు. అభివృద్ధిని ఎక్కడికక్కడ వదిలేసి పదవుల కోసం కొట్లాడే కౌన్సిలర్లను ఎందుకు ఎన్నుకున్నాం రా నాయనా అనే అభిప్రాయాలు ప్రజల నోటి నుంచి వినబడుతున్నాయి.