Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హాష్ ఆయిల్‌ను సప్లరు చేస్తున్న ప్రధాన నిందితుడితో పాటు అతని ముగ్గురు అనుచరులను హైదరాబాద్ నార్కొటెక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-ఎన్ఇడబ్య్లూ), చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 60బాటిళ్లలోని 400లీటర్ల హాష్ ఆయిల్తోపాటు మూడు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. మంగళ వారం డీసీపీ జి.చక్రవర్తి తెలిపిన వివరాల మేరకు కుత్బుల్లాపూర్‌కు చెందిన ఎన్.ప్రవీణ్‌కుమార్ వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి నగరంలో విక్రయించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సులువు గా డబ్బులు వస్తుండడంతో హాష్ ఆయిల్‌పై దృష్టి సారిం చాడు. ఇందులో భాగంగా పటాన్‌చెరుకు చెందిన పి.మోహన్ యాదవ్, కూకట్‌పల్లికి చెందిన పి.కల్యాణ్, బి.సురేష్‌తో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొస్తున్న నిందితులు హాష్ ఆయిల్‌ను తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు బెంగుళూర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నారు. పెద్దఎత్తున ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా దేశవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి, హాష్ అయిల్ను సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఫోర్సుమెంట్ బృందం, చిక్కడపల్లి పోలీసులతో కలిసి నిందితులను అరెస్టు చేశారు. డ్రగ్స్‌కు, గంజాయికి యువకులు దూరంగా ఉండాలని డీసీపీ కోరారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ రమేష్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో సంజేయ్‌కుమార్, ఎస్ఐ సి.వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.