Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా నాయకులు ఎం.శంకర్
నవతెలంగాణ-కెపిహెచ్బి
జనవరి 3వ తేదిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా నాయకులు ఎం.శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం సావిత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా జెఎన్టీయూ ప్రగతినగర్ ఆటో స్టాండ్ వద్ద సీపీఐ(ఎం) సీఐటీయూ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు సీఐటీయూ ఆటో స్టాండ్ అధ్యక్షులు బాబునాయక్, మాజీ అధ్యక్షులు మహేష్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సింగాటి ప్రభుదాస్, కార్యదర్శి వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు. 3వేల ఏండ్లుగా శూధ్రులకు మహిళలకు చదువును నిషేధించిన మనస్మృతిని ఛేదించిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలో నయాగావ్‌లో సావిత్రిబాయి పూలే జన్మించారని, తన 9వ ఏట మహాత్మ జ్యోతిరావు పూలేని వివాహమాడిందని అన్నారు. తన భర్త వద్దనే అక్షరజ్ఞానం నేర్చుకొని ఉపాధ్యాయు రాలుగా ఎదిగి శూధ్రులకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు చదువులు చెప్పిందని అన్నారు. ఎన్నో విక్షేతలు, అవమానాలు, దాడులను సైతం ఎదుర్కొని సొంతంగా పాఠశాల ఏర్పాటు చేసి చదువులు చెప్పిన మొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారని కీర్తించారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తిరిగి మనస్మతిని తీసుకురావాలనే ప్రయత్నం కుట్రలు చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్లో నూతన విద్యా విధానం 2020 బిల్లును అమలు చేసుకుని 300 ఏళ్ల కిందట మెజార్టీ ప్రజలకు చదువును ఎలాగైతే దూరం చేశారో, మళ్లీ ఆ కుట్రలు మొదలుపెట్టిందని అన్నారు. విద్యారంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుందని అన్నారు. నిరుపేదలు, దళితులు చదువుకొనలేక ఉన్నత విద్యకు దూరం కావడం తప్ప ఈ బిల్లు వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పారు. నూతన విద్యా విధానం అమలు చేయడం ద్వారా ప్రైవేటీకరణ కార్పొరేటీ కరణ, కేంద్రీకరణ వంటి లక్ష్యాలు సాధించాలని భావిస్తుందని తెలిపారు. సావిత్రిబాయి పూలే కరువు కాటకాలలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అక్కడ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, చివరకు ఆ ప్లేగు వ్యాధి సోకి 1897 మార్చి 10న ఆమె కన్నుమూశారని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం, సమాజం కోసం సేవ చేసినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి దినోత్సవం జనవరి 3ను మొదటి భారతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ, బాలు, శ్రీను, దుర్గేష్, రమేష్, నర్సింహులు, నరసింహ, జ్ఞానేశ్వర్, రజని, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
కేపీహెచ్బి 3వ ఫేజ్‌లో ... నిమ్న వర్గాల అభ్యున్నతికి మహాత్మా సావిత్రిబాయి పూలే కృషి చేశారని, మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా నరసింగరావు అన్నారు. మంగళవారం భారతీయ సంఘ సంస్కర్త మహాత్మా సావిత్రిబాయి పూలే 192వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో 3వ ఫేస్ కట్టా వారి సేవా కేంద్రం వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి లక్ష్మీనారాయణ, శ్రీరామ్ దాస్ రఘురామ్, కాముని నరసింహారెడ్డి, పుసునూరు నాగేశ్వరరావు, అతోట శివరామకుమార్, వడ్లమూడి శ్రీనివాసరావు, పాతూరి మద్దిరామయ్య, రామసహాయం బుచ్చిరెడ్డి, యలమంచిలి వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు, శ్యాంకుమార్, నరహరి, దొరబాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్‌లో... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, షాపూర్ నగర్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియా డారు. సావిత్రిబాయి పూలే ఆశయాలు నెరవేరాలంటే దేశవ్యాప్తంగా అక్షరాస్యతను పెంచాలని గుర్తుచేశారు. అనంతరం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు, డీవైఎఫ్ఐ, ఐద్వా, అంజయ్య, స్వాతి, ప్రజాసంఘాల పోరాటవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.