Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య
- ఉప్పరిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన అభిషేక్ అగస్త్య
- మన బస్తి-మన బడి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
నవతెలంగాణ-శామీర్పేట
కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు వసతుల కల్పన కోసం మన బస్తి మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభేషేక్ అగస్త్య అన్నారు.
తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో మన బస్తి మన బడి కింద ఎంపికైన ఉప్పరిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం మేడ్చల్ అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య డీఈఓ విజయ కుమారితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మన బస్తి - మన బడి కింద జరుగుతున్న ఎలక్ట్రిఫికేషన్, ప్రహరీగోడ, టాయిలెట్స్ నిర్మాణం, తాగునీరు సౌకర్యం, మేజర్, మైనర్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పొలమొల్ల పాండు, మున్సిపల్ డీఈ సునీత, ఏఈ రాజశేఖర్, ఎంఏ ఓ.రవీంద్రరాజు, స్కూల్ చైర్మెన్ కృష్ణ, మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, కట్టెల రవీందర్, ప్రధానోపాధ్యాయులు కుమార్, ఉపాధ్యాయులు సత్యం, స్నేహాలత, రాజు, రాధ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.