Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
సావిత్రిబాయి ఫూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలి పీడీఎస్‌యూ సెంట్రల్ జోన్ కార్యదర్శి శ్యామ్ డిమాండ్ చేశారు. పూలే 192 వ జయంతి సందర్భంగా సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో కోఠి మహిళా కళాశాలలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మంద నవీన్, ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా నాయకులు దేవేందర్, రమ్య, మానస, ప్రగతి, తదితరులు పాల్గొన్నారు.
ఓయూ : ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఎదుట సావిత్రిబాయి పూలే 192వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఆర్ మూర్తి మాట్లాడారు. పూలే జయంతి సందర్భంగా కేవలం పూలమాలలు వేసి నమస్కరించడం కాకుండా ఆమె గురించి ప్రతి మహిళా, ప్రతి ఒక్కరూ యాధిలో పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఎస్ఎఫ్ఐ ఓయూ ఉపాధ్యక్షులు సాయికిరణ్, శ్రీను, పవన్, ఎస్ఎఫ్ఐ నాయకులు శరణ్య, అక్షయ, మధుమతి, జ్యోతి, గణేష్, శ్రీధర్, పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ : పూలే 192వ జయంతిని సీఐఈయూ వెంగళరావు నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చంద్రశేఖర రావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాపర్తి అశోక్, జి.భిక్షపతి, ఎండి అసిఫ్, మహబూబ్, రహీం, పి.లింగయ్య ఎం.లక్ష్మణ్, డేవిడ్, అజ్జు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ : సావిత్రి బాయిపూలే జయంతిని ''జాతీయ ఉపాధ్యా య దినోత్సవం''గా జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగ రాజు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ సహాయ కార్య దర్శి సునీల్ అధ్యక్షతన బోరబండ బాలికల గురుకులంలో పూలే 192వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరా జు మాట్లడుతూ దేశంలో మహిళలకు విద్యను అందించాలని అనేక అవమానాలు ఎదుర్కొని పాఠశాలలు నెలకొల్పి చదువును చెప్పిష నట్టు తెలిపారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌రెడ్డి మాట్ల డుతూ సతి సహగమనం లాంటి సాంఘీక దురాచారం పోవాలని పోరాడిన పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్య క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శోభరాణి, ఎస్ఎఫ్ఐ బోరబండ కార్యదర్శి సునీల్, నగర నాయకులు నాగేందర్, శివ ు పాల్గొన్నారు.