Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
అంతరించిపోతున్న దేశ కళలను భావిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కళాకారులపై ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం కోఠిలోని ఎస్బీఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఓయూవెరే పేరిట ఏర్పాటు చేసిన ఆర్ట్ క్యాం పును బ్యాంక్ సీజీఎం అమిత్ జింగ్రాన్తో కలిసి జయేష్ రంజన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నా రు. అందులో భాగంగా ఎస్బీఐ ఈ ఆర్ట్ క్యాంపును నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ క్యాంపులో రాష్ట్రంలోని 27 మంది ప్రముఖ చిత్రకారులు నేతృత్వంలో ఐదు రోజుల పాటు వివిధ చిత్రాలు వేయనున్నట్టు పేర్కొ న్నారు. ఆసక్తి గల చిత్రకారులు వారి సలహాలతో క్యాంప్ లో పాల్గొని వారి సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు అని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా సేవలందిస్తున్న ఎస్బీఐ ఆర్థిక లావాదేవీలతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుందని ఎస్బీఐ హైదరాబా ద్ సర్కిల్ సీజీఎం అమిత్ జింగ్రాన్ అన్నారు. అందులో భాగంగానే 20 ఏండ్లుగా ఈ ఆర్ట్ క్యాంపును నిర్వహిస్తూ చిత్రకారులను సన్మానిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 7వ తేదీ వరకు ఈ ఆర్ట్ క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కూచిపూడి నృత్యం అలరించిం ది. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం అమిత్ జింగ్రాన్, అధికారులు, హైదరాబాద్ సర్కిల్ ఎస్బీఐ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ నుపుర్ జింగ్రాన్, అర్ట్ గ్యాలరీ కో-ఆర్డినేటర్ ఆశా రాధిక, లేడీస్ క్లబ్ మహిళా ప్రతినిధులు, చిత్రకారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.