Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-అంబర్పేట
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన యాదగిరిగుట్టలో నిర్వహించనున్న బీసీ విద్యుత్ ఉద్యోగుల 17వ రాష్ట్ర మహాసభను విజయ వంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం కాచిగూడలోని అభినందన్ హౌటల్లో నిర్వహించిన సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల అధ్యక్షులు కుమారస్వా మి, ముత్యం వెంకన్న గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బ్రహ్మేందర్ రావుతో కలిసి మాట్లాడారు. విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణను ఉద్యో గులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. బీసీ ఉద్యోగుల్లో క్రిమిలేయరును వెంటనే రద్దు చేయాలనీ, విద్యుత్ బీసీ ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయనీ, వారికి కావాల్సిన ప్రమోష న్లు, ఇతర సౌకర్యాలను కల్పించకపోగా.. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదన్నారు. బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయనీ, 16 రాష్ట్రాల నుంచి పార్లమెంట్లో బీసీ ప్రాతినిధ్యం లేదన్నారు. 2009 నుంచి నేరుగా నియమించబడిన ఉద్యో గులను సీనియార్టీని ప్రతిపాదికాదన అర్హులైన వారందరికీ ప్రమోషన్లు కల్పించాలనీ, విద్యుత్ ఉద్యోగుల సమస్యలను షరతులతో కూడిన ప్రమోషన్లను వెంటనే నిలిపివేయాల నీ, హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలనీ, విద్యుత్ కంపె నీల యజమానుల ఆగడాలపై ప్రభుత్వలపై సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం విద్యుత్ ఉద్యోగుల కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, అశోక్ కుమార్, నరేందర్ విజరు కుమార్ డాక్టర్ చంద్రుడు, నీలం వెంకటేష్, కిషోర్ కుమార్, ఇతర నాయకకులు, తదితరులు పాల్గొన్నారు.