Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగర్కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మెన్
ఠాగూర్ బాలాజీ సింగ్
నవతెలంగాణ-అంబర్పేట
పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలి అని నాగర్ కర్నూల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్ అన్నారు. బుధవారం నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నవతెలంగాణ దినపత్రిక ముందుందన్నారు. కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాడే ఏకైక దినపత్రిక నవతెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పొనుగోటి రవీందర్ రావు, రమేష్ గౌడ్, నవతెలంగాణ సిబ్బంది, వివిధ పత్రికల రిపోర్టర్లు, తదితరులు పాల్గొన్నారు.