Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ కార్యకలా పాల నిర్వహణలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాన్ని నిత్యం అగ్ర స్థానంలో నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నామనీ, ఈ క్రమంలో భవిస్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రణాళికా బద్దంగా సదుపా యాలను కల్పిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మా రావుగౌడ్ వెల్లడించారు. నామాలగుండులో సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయ నిర్మాణ పనులను పద్మారావుగౌడ్ బుధవారం ప్రారంభించారు. రూ.2 కోట్ల మేరకు నిధులతో దాదాపు 795 చదరపు గజాల స్థలంలో మూడంస్తులతో ఈ కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కొత్త వార్డు కార్యాలయ భవనాల నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సితాఫల్మండి ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలను ప్రారంభించి స్థానికుల దశాబ్దాల కలను నేరవేర్చగాలిగా మని తెలిపారు. రూ.29 కోట్ల ఖర్చుతో కొత్త భవనాల నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని తెలి పారు. కుట్టి వెల్లోడి ప్రభుత్వాస్పత్రి కొత్త భవనాలు రూ.11.60 కోట్లు మంజురయ్యాయనీ, నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మెట్టుగూడ నుంచి ఆలుగడ్డ బావి మీదుగా చిలకలగూడ ప్రధాన రహదా రిలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు, సితాఫల మండి-తార్నాక మధ్య మనికేశ్వరినగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వల్ల రెండు వైపులా రాకపోకలు సాగించే వారు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. కొత్త సంవత్సరం 'లష్కరులో అభివృద్ధి పనులు చురుకుగా సాగే సంవత్సరం'గా మారనుందని పద్మారా వుగౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, కార్పొరేటర్ సామల హేమ, యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిష నర్ దశరత్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.