Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్
రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్దతుల పట్ల అవగాహణ కల్పించాల్సి న అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన రైతులకు చేయూతనందించడమే లక్ష్యంగా ఏర్పాటైన కేతివాల్ అంకుర సంస్థ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద రైతులకు భరోసా ఇవ్వడానికి కేతివాలా సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నా రు. దేశంలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధార పడుతున్న కేంద్ర ప్రభు త్వం తగిన చేయూతనందించలేకపో తుందన్నారు. సన్నకారు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి పంటకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామంటూ కేతివాలా సంస్థ ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కేతివాలా సంస్థ ఫౌండర్ కె.లక్ష్మణ్, సత్యనారాయణమూర్తి, తరుణ్, సురేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.