Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఈ శ్రమ కార్డులను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రమీల తెలిపారు. నేడు యూసఫ్ గూడ లేబర్ అడ్డా వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులు, అడ్డా కూలీలు, ఇంటి పని వారు, ఆటో డ్రైవర్స్, టైలర్స్, ఇస్త్రీ చేసేవారు, ఈఎస్ఐ, పీఎఫ్ లేని కార్మికులందరూ ఈ శ్రమ కార్డుల కోసం అర్జీలు పెట్టుకోవాలని తెలిపారు. వెంగళరావు నగర్ డివిజన్ యూసఫ్‌గూడ లేబర్ అడ్డా వద్ద కార్మికులందరికీ బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ కార్మికులందరినీ ఈ శ్రమ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావాలని నిర్ణయం చేసినట్టు తెలిపారు. అందులో భాగంగానే ఈ ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చినిపోతే రూ.2 లక్షలు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాపర్తి అశోక్, ప్రసాద్, కాజా మియా, ముత్తయ్య. తదితరులు పాల్గొన్నారు.