Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాజులరామారంలోని చిత్తరమ్మ ఆలయ ప్రాంగణంలో ఆధ్వర్యంలో గాజులరామారం (125), చింతల్ (128), సూరారం (129), సుభాష్ నగర్ (130), కుత్బుల్లాపూర్ (131), జీడిమెట్ల (132) డివిజన్ల బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జిల సమావేశానికి జాతీయ ఉపాధ్యక్షురాలు అసెంబ్లీ పాలక్ డీకే అరుణ హాజరయ్యారు. అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 7న జాతీయ అధ్యక్షులు జేపీ అడ్డాతో వర్చువల్గా బూత్ కార్యకర్తల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశా-నిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గరిగే శేఖర్ ముదిరాజ్, బావిగడ్డ రవి, బక్క శంకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి, డివిజన్ల అధ్యక్షులు ఇన్చార్జిలు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలు పాల్గొన్నారు.