Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
సాయిస్థలి సేవాట్రస్టు, వైదేహినగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఓజోన్ హాస్పిటల్స్ మేనేజర్ గణేష్ మాట్లాడుతూ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. డాక్టర్ నాగరమ్య 85 మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో వైదేహి నగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ కాలనీ అధ్యక్షుడు పోగుల రాంబాబు, సభ్యులు రాజేందర్ రెడ్డి, వేణుగోపాల్, నాగరాజ్ మరియు సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకటరెడ్డి, రవీందర్, రాములు పాల్గొన్నారు.