Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లను వెంటనే కార్మికులుగా గుర్తించడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ అన్నారు. శుక్రవారం కూకట్ పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలో ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై వారితో కలిసి నిరసన తెలిపారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తుంచి, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలనీ, స్కీం వర్కర్లను స్వచ్ఛంద సంస్థలకు, ప్రయివేటు వాళ్ళకు ఇవ్వద్దని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను.ఎండగడతామని రాజశేఖర్ హెచ్చరించారు.
దుండిగల్ : రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతభత్యాలు పెరగాలనీ, స్కీముల పేరిట ప్రైవేటీ కరణ ఆపాలనీ, స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ దుండిగల్ మండల కన్వీనర్ బొడిగె లింగస్వామి డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం కుతుబుల్లాపూర్ దుండిగల్ గండి మైసమ్మ మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్ పద్మప్రియ, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వరులు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం అధికారికి వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, రాధ, లలిత, అనిత, హంస, పార్వతమ్మ, శోభారాణి, స్వరూప, పద్మ, అశ్విని, భాగ్యలక్ష్మి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల పట్ల నిర్లక్ష్యానికి నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ మండల తహసీల్దార్ సంజీవరావుకి స్కీమ్ వర్కర్ల డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కీలుకాని లక్ష్మణ్, సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి కె.బీరప్ప మాట్లాడారు. మోడీ ప్రభుత్వం 8 ఏండ్ల కాలంలో స్కీములను, స్కీమ్ వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. స్కీమ్ వర్కర్ల రక్షణ, స్కీముల సంరక్షణ హక్కుల సాధన కోసం స్కీమ్ వర్కర్లందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. స్కీం వర్కర్ల ఉద్యోగ భద్రత, సంక్షేమం, ఉద్యోగాల భద్రతను ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ నాయకులు వి.ఈశ్వ రరావు, వీరేష్, శ్రీకాంత్, కనకయ్య, సురేష్ స్కీమ్ వర్కర్ల నాయకులు ఝాన్సీ, స్వాతి, అరుణ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.