Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రతి విద్యార్థీ చిన్నప్పటి నుంచే విద్యలో ప్రతిభ కనబ రిస్తే భవిష్యత్‌లో విశ్వాన్ని జయించవచ్చు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద విద్యార్థులకు సూచించా రు. శుక్రవారం చింతల్ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో గల సెయింట్ మార్టిన్ పాఠశాల 24 వార్షికోత్సవ వేడుకలను (క్రిసాలిస్) నిర్వమించారు. ముందుగా పాఠ శాల మేనేజింగ్ డైరెక్టర్ల బృందం, ప్రముఖ అథ్లెట్ పాఠశాల అధ్యక్షులు మర్రి లక్ష్మణ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జి.చంద్ర శేఖర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ జి.రాజశేఖర్ యాదవ్, జి.జై కిషన్ యాదవ్‌తోపాటు పాఠశాల ప్రిన్సిపాల్ అనిత రావు చేప్యాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక విద్యతో విద్యార్థులు పోటీపడు తూ.. చదువుతూ.. ఉత్తమ ఫలితాలు సాధిస్తూ.. ప్రపంచ దేశాల్లో మంచి హౌదాలో ఉన్నారని గుర్తు చేశారు. విద్యా ర్థులు విద్యతోపాటు క్రీడలు, శాస్త్ర సాంకేతిక, సామాజిక రంగాల్లో రాణించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాల న్నారు. చింతల్ సెయింట్ మార్టిన్ పాఠశాల విద్యార్థులను ఎంతో మందిని డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సైంటిస్టులుగా తయారు చేసిన పాఠశాల డైరెక్టర్లు, ఆధ్యాపక బృందాన్ని అభినందించారు. ప్రముఖ అథ్లెట్, పాఠశాల అధ్యక్షులు మర్రి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల కనబరిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. ఏ రంగంలోనైనా కష్టపడే కంటే ఇష్టపడితే కలలు సాకారం చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు మనోభావాలకు అను గుణంగా విద్యానందిస్తూ వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ అనితారావు చేప్యాల మాట్లాడుతూ విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రతి ఏడాదీ మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చింతల్ అశోక్, బండారు వరప్రసాద్, మక్సూద్ అలీ, సామ్రాట్, మన్నే రాజు పాల్గొన్నారు.