Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
బేగంపేట డివిజన్లోని దేవుడి ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీనిచ్చారు. శుక్రవారం ఆయన దేవుడి ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రయినేజీ ఓవర్ ప్లో సమస్యను పరిష్కరించాలని కోరగా, ఎయిర్ టెక్ మిషన్ ను తెప్పించి సివరేజీ లైన్ క్లీనింగ్ కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లను నిర్మించాలని కోరగా, వెంటనే ప్రతిపాదనలను అందజేయా లని అధికారులను ఆదేశించారు. కాలనీ ప్రజల అవసరాల కోసం నూతన కమ్యునిటీ హాల్ నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అర్హులైన వారం దరికి పెన్షన్లు అందించేందుకు దేవుడిలో మూడు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తహశీల్దార్ అహల్యను మంత్రి ఆదేశించారు. తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననీ, సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారా నికి కృషి చేస్తానని చెప్పారు. మంత్రి వెంట కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, ముకుంద రెడ్డి, సుదర్శన్, శానిటేషన్ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ మేనేజర్ శశాంక్, స్ట్రీట్ లైట్ అధికారి సాగర్, నాయకులు నరేందర్, శ్రీహరి, శ్రీనివాస్ గౌడ్, శేఖర్, కాలనీ అద్యక్షుడు అఫ్జల్, తదితరులు ఉన్నారు.