Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉండే వాసవీ క్లబ్ ఇంటర్నేషన్ సంస్థ శుక్రవారం నూతన కమిటీ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్కానా శ్రీపురి కాలనీలోని క్లబ్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో వాసవీ క్లబ్ ముందుండటం హర్షనీయమన్నారు. అనంత రం వాసవి క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యే సాయన్నను సన్మాని ంచారు. జాతీయ అధ్యక్షురాలు మిఎన్. పాలకుర్తి గాయత్రి, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్. రవిచంద్రన్, సెక్రటరీ ఇరుకుల రామకృష్ణ ట్రెజరర్ సంతోష్ చక్రవర్తి పదవీ బాధ్యతలు చేపట్టారు. వాసవీ క్లబ్ ఇంటర్నేషన్ జాతీయ అధ్యక్షురాలు, సభ్యుల పదవీ బాధ్యతల కార్యక్రమానికి ఎమ్మెల్సీ దయానంద్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, అమరవాది లక్ష్మినారాయణలు హాజరయ్యారు. ఆర్యవైశ్యులంటేనే సేవకు ప్రతి రూపం అని కొనియాడారు. సామా జిక సేవా కార్యక్రమాలు చేస్తూ, పేద ప్రజలను ఆదుకుం టూ వాసవీ క్లబ్ ఇంటర్నేషన్ సంస్థ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్ ప్రతినిధుల కార్యాలయం ఎదుట ఉన్న పార్కును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సాయన్నకు దృష్టికి తీసుకు రాగా బోర్డు అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రేపాల వెంకటేశ్వర్లు, వాసవీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తేలుకుంట సతీష్ గుప్తా, నాయకులు భాస్కర్ ముదిరాజ్, ఎమ్మెల్యే కుమార్తె నివేదిత పాల్గొన్నారు.