Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
చీరల విక్రయాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిడెట్ తన 53వ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ నూతన ఎస్ఎస్కేఎల్ స్టోర్‌ను 'మందిర్' బ్రాండ్ పేరుతో నిర్వహించ నున్నారు. ఈ స్టోర్‌ను నానక్‌రామ్‌గూడ ఖాజాగూడ వద్ద సినీనటి శృతిహాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిసిల్క్స్ (కళామందిర్) మేనేజింగ్ డైరెక్టర్ నాగకనక దుర్గాప్రసాద్ చలవాడి మాట్లాడుతూ ''అల్ట్రా పీమియం, ప్రీమియం చీరలు సహా మా భిన్నమైన ఆఫరింగ్‌తో ఎథ్నిక్ ఫ్యాషన్లకు సంబంధించి ఓ అధీకృత సంస్థగా సాయి సిల్క్స్ గుర్తింపు పొందింది. నగరంలో నాలుగో మందిర్ స్టోర్‌ను ప్రారంభించడం సంతోషం. మా వినియోగదారులకు అత్యున్నత విలువలు గల అనుభ వాలను అందించడంలో మా శక్తిని ఇది ప్రదర్శిస్తుంది. ఈ నూతన స్టోర్ మొత్తం శ్రేణి అల్ట్రా ప్రీమియం డిజైనర్ చీరలను అందించనుంది'' అని తెలిపారు. సినీనటి శృతిహాసన్ మాట్లాడుతూ ''సాయి సిల్క్స్ నైపుణ్యం, వినూత్నమైన డిజైన్లపై దృష్టి, స్టైల్ ఉండేందుకు, జీవితంలో అరుతైన ప్రతి క్షణాన్నీ వేడుక చేసుకోవడానికి స్ఫూర్తి కలిగిస్తాయి. నాణ్యత, వినియోగదారుల సేవపై దృష్టి సారించే ఈ సంస్థ అందించే ఉత్పత్తి శ్రేణి భిన్నంగా ఉంటుంది. దీని బ్రాండ్ గుర్తింపును మరింతగా పెంచుకోవడంతోపాటు కస్టమర్ లాయల్టీ సైతం మెరుగుపరుస్తుంది'' అని తెలిపారు.