Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి పాలన అనీ, 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం గాజులరామారం డివిజన్ పరిధిలోని సత్య గౌరీ కన్వెన్షన్ హాల్లో బీజేపీ కుత్బు ల్లాపూర్ నియోజకవర్గ బూత్ సమ్మేళనం అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌తోనే కొట్లాడాలన్నారు. ఇక్కడున్న నాయకులు ఊదితే కొట్టుకుపోతారన్నారు. కుత్బుల్లా పూర్లో రూ.5 కోట్ల భూకుంబ కోణం జరిగితే ఆర్డీవో ఆదేశాల మేరకు ఎన్ని కేసులు నమోదు చేశారో, ఎంత మందిని అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల రక్షణకు చైర్మన్‌గా వ్యవహరిం చాల్సిన ఎమ్మెల్యే ఇంత పెద్ద భూ కుంభకోణం జరుగుతుంటే ఏం చేస్తున్నాడనీ, అతనికేమైనా భాగ స్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్‌లో జరుగుతున్న భూకబ్జాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేకు దమ్ము, దైర్యం ఉంటే రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే తన జీతాన్ని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఖర్చు చేస్తానని చెప్పినా.. నేటికీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగానే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చే మోసపూరిత హామీలను బీజేపీ శ్రేణులు, బస్తీల్లోని ప్రజలకు వివరిం చాలనీ, ప్రజలను చైతన్యవంతులు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకుల అరాచకాలను, అవినీతి, కబ్జాల పట్ల నిరంతర పోరాటం చేస్తామన్నారు. అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్.ఎస్మల్లా రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గరిగె శేఖర్ ముదిరాజ్, భావిగడ్డ రవి, రాజి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భరత్ సింహ రెడ్డి, లక్ష్మి పతి రాజు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ మోర్చాల పదా ధికారులు, డివిజన్ ఇన్చార్జిలు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.