Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభాగం డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సురేష్ కుమార్
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
జేఎన్టీయూహెచ్ విశ్వవిద్యాలయంలో నూతనంగా పూర్వ విద్యార్ధుల విభాగానికి డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలను స్వీకరించిన ప్రొఫెసర్ జె.సురేష్ కుమార్‌ను శనివారం జేఎన్టీయూహెచ్ జేఏసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జేఎన్టీయూహెచ్ విశ్వవిద్యాల యంలో నూతనంగా పూర్వ విద్యార్ధుల విభాగం ఏర్పాటు చేసిన వైఎస్ ఛాన్సలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్ధుల పాత్ర చాలా ముఖ్యమైనది. జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థు లు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉద్యోగులుగా, వ్యాపార వేత్తలుగా, రాజకీయ నాయకులుగా అత్యున్నత స్థాయికి ఎదిగిన చరిత్ర యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నదన్నారు. ఆ స్థాయిలో ఉన్న విద్యార్థులు తాము చదువుకున్న విశ్వవిద్యాలయానికి తమదైనశైలిలో ప్రస్తుతం చదువుకుంటు న్న విద్యార్థులలకు, విద్యాలయానికి వారికున్న సమయాన్ని, జ్ణాణాన్ని, ఆర్థిక వనరులను అందిస్తూ వారికి ఎదురైనా కష్టసుఖాలను అందివ్వడానికి, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి రాష్ట్ర, దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేందుకు మంచి అవకాశంగా, వేదికగా ఈ పూర్వ విద్యార్ధుల విభాగం పని చేస్తుందన్నారు. ప్రొఫెసర్ జె.సురేష్ కుమార్ తనకున్న అనుభవంతో పూర్వ విద్యార్థుల విభాగానికి వన్నె తెచ్చే దిశగా జేఎన్టీయూహెచ్ జేఏసీ విద్యార్థులు, యూనివర్సిటీ పూర్వ విద్యార్ధుల సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ బొట్ల బిక్షపతి, అధ్యక్షులు మంద రంజిత్ కుమార్, వైస్ చైర్మన్ ధరమ్ సోతు శ్రీనివాస్ నాయక్, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ బల్గర్ సందీప్, కమిటీ సభ్యులువిద్యార్థులు పాల్గొన్నారు.