Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజల పక్షాన పోరాటం చేసే పత్రిక నవతెలంగాణ అని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. శనివారం నాగారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నవతెలంగాణ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తూ వార్త కథనాలను ప్రచురిస్తున్న నవతెలంగాణ పత్రిక మరింతగా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీడియా పని చేయాల్సిన అవసరం ఉందన్నా రు. నవతెలంగాణ పత్రిక ప్రజలకు అవసరమయ్యే కథనాలను మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా క్యాలెండర్ ఎంతో నాణ్యతతో తీసుకొస్తున్నారనీ, పత్రికా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి జోన్ ఇన్చార్జి జహంగీర్, మేడ్చల్ కలెక్టరేట్ రిపోర్టర్ బి.యాదగిరి, నాగారం మున్సిపల్ వైస్ చైర్మన్ బి.మల్లేష్ యాదవ్, నాగారం మున్సిపల్ కమిషనర్ వాణి రెడ్డి, కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్ గౌడ్, కౌకుంట్ల మమత, అన్నం రాజు సుమిత్ర. బీఆర్ఎస్ నాగారం మున్సిపల్ అధ్యక్షుడు తేల శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.