Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. శనివారం నాగారం మున్సిపాల్టీ 9వ వార్డు పరిధిలోనీ శాంతినగర్ కాలనీ వద్ద హెచ్హెండీ ఏ నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మున్సిపా లిటీ పరిధిలోని అన్ని కాలనీలను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, 9వ వార్డు కౌన్సిలర్ కొమిరెల్లి అనిత సుధాకర్‌రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు, నాయకులు సత్యంరాజు, నర్సింహా, యాకయ్య, కిషన్ నాయక్, ఉచిడి దేవేందర్ రెడ్డి, నర్సింహా, చెండి శ్రీనివాస్, చంద్రయ్య, భీమా నాయక్, అబ్బోజు సుధాకర్, కిష్టయ్య, మోహన్, భాస్కర్, వెంకటేష్, గంగయ్య, నాయుడు పాల్గొన్నారు.