Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్ పల్లి
ఆంగ్ల భాషలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆంగ్లంలో సరళంగా మాట్లాడగలిగితే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సాధించుకుని జీవితంలో స్థిరపడి ఉన్నత స్థానలోకి చేరవచ్చని మూసాపేటలోని బాలుర జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ పాల్ సింగ్ అన్నారు. రాష్ట్ర స్థాయి స్పెల్ విజర్డ్ అండ్ స్టోరీ టెల్లింగ్ పోటీలో భాగంగా, మండల స్థాయిలో జరిగిన పరీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా వ్యవహరించారు, ఈ పరీక్షల్లో గెలుపొ ందిన మేడ్చల్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన నాగ నందిని జెడ్పిహెచ్ఎస్ కూకట్ పల్లి, లక్ష్మిబారు శంశి గూడ, కే.సంధ్య, జెడ్ పి హెచ్ ఎస్ బాలికల మూసపెట్, ప్రవీణ్ కుమార్, జెడ్పిహెచ్ఎస్ బాలుర మూసపెట్ విద్యార్థులకు ఎన్జీఅర్ఐ శాస్త్రవేత్త ప్రభాకర్ చేతి వాచీల ను బహుమతులుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి ఆంగ్ల ఉపాధ్యాయుడు, సమన్వయ కర్తగా వ్యవహ రించారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ, కృష్ణయ్య, రాములు, ఆయా పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.