Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ మేకల కావ్య
నవతెలంగాణ-జవహర్ నగర్
ప్రతీ ఒక్కరు విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని మేయర్ మేకల కావ్య అన్నారు. కంటి చూపు లేకుంటే ఎంతో బాధాకరమని.. కంటి చూపు భవితకు మలుపు అని చెప్పారు. సోమవారం కార్పొరేషన్లోని డ్వాక్రా భవన్లో మేయర్ అధ్యక్షతన కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు పథకం ప్రవేశపె ట్టిందని, అధికారులు సమన్వయంతో పనిచేయా లని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామ లింగం, డాక్టర్ పద్మావతి, మున్సిపల్ డీఈ బాల మురళి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్పీలు, ఆశావర్కర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.