Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వగృహ టవర్స్ కోనుగోలుకు ముందుకు వచ్చిన బిల్డర్లు, ఉద్యోగుల సంఘాలు
- పేమెంట్ల గడువు పెంచాలని, సింగిల్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించాలని కోరిన బిల్డర్లు, ఉద్యోగులు
- ప్రభుత్వానికి నివేదిస్తామన్న అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు సంబంధించిన టవర్లు అమ్మకాల కోసం సోమవారం జరిగిన ప్రీ బిడ్ సమావేశం విజయవంతమైంది. ఈ సమావేశానికి 50 మందికిపైగా బిల్డర్లు, ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రీ బిడ్ సమావేశానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సెక్రెటరీ పి.చంద్రయ్య, హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, హెచ్‌ఎండీిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డిలతో పాటు గహ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజులరామారం టౌన్‌షిప్‌ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా అమ్మకాలకు పెట్టిన విషయం తెలిసిందే.
పోచారంలో 9 అంతస్తుల నాలుగు టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో కనీసం 72 నుంచి 198 ప్లాట్లను నిర్మించుకునే సదుపాయం ఉంది. గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో 112 ప్లాట్లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న పోచారం, గాజులరామారం స్వగహ టవర్లను కొనుగోలు చేయడానికి బిల్డర్లు, డెవలపర్లు, పలు ఎంప్లాయిస్ సొసైటీలు ఆసక్తి కనబరిచాయి. సమావేశంలో పాల్గొనవారు కొన్ని సూచనలను చేశారు. ఫైనల్ పేమెంట్స్ గడువు పెంచాలని, సింగిల్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించాలని, జీఎస్టీ భారం లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాజీవ్ స్వగహ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య వారికి వెల్లడించారు.