Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు
నవతెలంగాణ-బడంగ్పేట్
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు వివిధ రకాల ముగ్గులు వేయడం ఎంతో శోభాయమానంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర కారవ్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. సోమవారం బడంగ్‌పేట కార్పొరేషన్ అల్మాస్‌గూడలో జరిగిన రంగవల్లుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్ది ముగ్గులు పెడుతారో సమాజాన్ని కూడా నడిపించే శక్తి సామర్థ్యాలు మహిళలకు సొంతం అని అన్నారు. సంక్రాంతి సంబురం, దేశ ఔన్నత్యం, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వివిధ రకాల ముగ్గులు వేసి రంగులు అద్దారని వారి గొప్పతనాన్ని కొనియాడారు. మహిళలు సామాజిక బాధ్యతగా గుర్తించి రాజకీయాల్లోకి వచ్చి పల్లెలు, పట్నాలను బాగు చేయాలని ఆడపడుచులను అభ్యర్థించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ మాజీ కన్వీనర్ ధీరజ్ రెడ్డి, కార్పొరేటర్లు రామిడి మాధురి వీరకర్ణారెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, నాయకులు గడ్డంపల్లి శశివర్దన్ రెడ్డి, మఠం శ్రీకాంత్ చారి, సురేష్, శ్రీశ్రీ హోమ్స్ కాలనీ ప్రెసిడెంట్ ఆనందం, మహిళా మోర్చా అధ్యక్షులు మమత ఆనంద్, గోలి లక్ష్మీనారాయణ, పటోళ్ల జయసింహరెడ్డి, నర్మద, రాణి తదితరులు పాల్గొన్నారు.