Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భైరవ విద్యా భవన్ కరస్పాండెంట్ డి. రోశయ్య
నవతెలంగాణ-బాలానగర్
విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలు సంక్రాంతి విశిష్టతను తెలుసుకోవాలని భైరవ విద్యా భవన్ కరస్పాండెంట్ డి. రోశయ్య సూచించారు. శుక్రవారం బైరవ విద్యా భవన్, నవీన్ కాన్వెంట్ స్కూళ్లలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థినులు ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. ఈసందర్భంగా రోశయ్య మాట్లాడుతూ నింగిలోని ఇంద్రధనస్సు నేలపై వాలినట్టు.. ఆకాశంలోని తారలన్నీ పుడమిపై మెరిసినట్లు.. విభిన్న వర్ణాలు వినూత్న రూపాల రంగవల్లికలు పాఠశాలలో కాంతులీనాయి. విద్యార్థులు సృజనాత్మక భావాలతో తీర్చిదిద్దే ముత్యాలముగ్గుల్లో సప్త శోభిత వర్ణాలు చక్కగా ఒదిగిపోయాయి. వారిలోని కళాత్మక భావాలకు ముగ్గుల పోటీలు వేదికగా నిలిచాయి. సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని సూచించారు.