Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగానే సంక్రాతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించటం జరిగిందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్ గుడలోని శ్రీహిల్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. శ్రీ హిల్స్ కాలనీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామ్ రెడ్డి హాజరయ్యారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళల అందరికీ బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో 26వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుల్లారెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామిడి రామ్ రెడ్డికి కాలనీవాసులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.