Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ జిల్లాలో 45.38 లక్షల మందికి స్క్రీనింగ్ లక్ష్యం
- మొదటి దశలో 42.21లక్షల మందికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- 91 పీహెచ్‌సీల పరిధిలో స్క్రీనింగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లాలో ఈనెల 18 నుంచి జూన్ 30వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహిం చేందుకు పటిష్టమైన ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 152 కేంద్రా ల్లో కంటి వెలుగు స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు.
మౌలిక వసతులు
కంటి వెలుగు స్క్రీనింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జీహెచ్‌ఎంసీి ప్రధాన భూమిక పోషిస్తున్నది. ముఖ్యంగా స్క్రీనింగ్‌కు వచ్చే నగరవాసులకు తాగునీరు, టాయిలెట్, టెంటు, కుర్చీలు, ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధమయ్యారు. జీహెచ్ఎంసీలో క్షేత్ర స్థాయిలో పని చేసే అధికారులు, సిబ్బంది కంటి వెలుగు కార్యక్ర మాన్ని నగర వాసులందరూ సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
91 పీహెచ్‌సీల పరిధిలో
హైదరాబాద్ జిల్లా పరిధిలో 91 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 152 స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా 45.38 లక్షల మందికి 100 రోజుల పాటు స్క్రీనింగ్ చేయను న్నారు. రీడింగ్ సమస్య ఉన్నవారికి వెంటనే కండ్ల అద్దాలు పంపిణీ చేస్తారు. ప్ర్రిస్క్రిప్షన్ ప్రకారంగా కావాల్సిన వారికి కంటి అద్దాలను వారి ఇంటికే పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. కంటి చికిత్స, మందులు కంటి అద్దాలు ఉచితంగా అందరికీ పంపి స్తారు. హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 91 పట్టణ ప్రాథమి క ఆరోగ్య కేంద్రాల పరిధిలో 152 కేంద్రాల్లో కంటి వెలుగు క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మొదటి దశలో ఇలా..
నగరంలో మొదటి దశలో 42.21 లక్షల మందికి స్క్రీనింగ్ టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 92 టీమ్‌లతో 176 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 8.92 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. 1.47 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ అందజే శారు. ఇతర సమస్యలకు 1.37లక్షల మందికి ఇతర కండ్ల అద్దా లు తీసుకోవాలని సూచించారు. కేటారాక్ట్ 22,081, కార్నీయా 4576, కాంప్లీకెటెడ్ కాటారాక్ట్ 11,681, స్క్యూంట్ 4042, సస్పెక్టెడ్ గ్లాకోమా 1848, సస్పెక్టెడ్ అంబ్లీపియా 3560 పలు పరీక్షలు నిర్వహించారు. అయితే మొదటి దశలో మిగిలినవా రందరికీ రెండో దశలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.