Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్
31 రోజులుగా ఉద్యమాలు చేస్తున్న పోలీస్ కానిస్టే బుల్ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవే ర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యానగర్‌లో ని బీసీ భవన్లో 14 బీసీ సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సై/ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు వివిధ రకాల పరీక్షలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దేహదారుద్య పరీక్షలకు 3.8 మీటర్లు ఉన్న లాంగ్ జంప్‌ను 4 మీటర్స్ పెంచారనీ, అందులో 50శాతం మంది కూడా క్వాలిఫై అవ్వడం లేదన్నారు. గతంలో నోట ిఫికేషన్, టెస్ట్‌లలో 5 రకాల ఈవెంట్స్ నిర్వహించేవారనీ, అందులో నుంచి ఏవేని 3 క్వాలిఫై అయిన వారికి సివిల్/ కమ్యూనికేషన్/ ఎక్సైజ్/ ఫైర్/ జైల్ వార్డెన్ లాంటి వివిధ రకాల పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అవకా శాన్ని కల్పించేవారని తెలిపాసరు. దానికి భిన్నంగా ఈ నోటిఫికేషన్లో 3 ఈవెంట్స్ పెట్టారనీ, ఇందులో అన్ని క్వాలిఫై అవుతూనే మెయిన్స్ రాయడానికి అవకాశం కల్పి స్తున్నారు అని తెలిపారు. దీని వల్ల ఒక ఈవెంట్లో క్వాలిఫై అవకుండా దాదాపు నాలుగు రకాలు ఎస్సై/ కానిస్టేబుల్ పోస్టులకు అర్హత కోల్పోతున్నారు అని తెలిపారు. పోలీస్ అభ్యర్థులు 1600/800 మీటర్స్ క్వాలిఫై అయినా వారికి సివిల్/ కమ్యూనికేషన్/ జైలు వార్డెన్/ డ్రైవర్/ ఎక్సైజ్ వంటి పలు పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలనీ, ఇదే నిరుద్యోగుల ప్రధాన విన్నపం అన్నారు. ఈ నోటిఫికేషన్ లో జరిగిన మార్పుల వల్ల 3 నెలలు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసినప్పటికీ లాంగ్ జంపులో ఒక అడుగు దూరం వల్ల సుమారు 14 రకాల ఉద్యోగాలకు దూరం అవుతున్నారన్నారు. సైబర్ నేరాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఫిజికల్‌గా చేయాలనీ, గత నోటిఫికేషన్ వల్లే రన్నింగ్ కంపల్సరీ అనీ, మెంటల్ ఫిట్ గా ఉండి చదువుతో ఉద్యోగం సాధించుకునేలా అవకాశం ఇవ్వాలి అని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే వచ్చే వారం వేలాది మందితో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీలా వెంకటేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల సుధాకర్, వేముల రామకృష్ణ, బీసీ యువజన సంఘం కన్వీనర్ రాజ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సుచిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.