Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రయివేటు జూనియర్ కళాశాలల యాజమాన్యం సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరీ సతీష్
నవతెలంగాణ-ముషీరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కళాశాలలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 72 వల్ల 346 జూనియర్ కాలేజీలకు లబ్ది చేకూరినట్లయిందని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కళాశాలల యాజమా న్యం సంఘం (టిపిడేఎంఏ) రాష్ట్ర కమిటీ పేర్కొంది. కళాశాలలకు 2023-2024 సంవత్సరానికి ఈ జీవో ద్వారా అఫిలియేషన్ ఇచ్చినందుకు టిపిజెఎంఏ నాయక త్వాన్ని అభినందించే కార్యక్రమం శుక్రవారం బాగ్లింగంప ల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో టిపిడే ఎంఏ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు డాక్టర్ శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గౌరీ సతీష్ మాట్లాడుతూ జీవో 72 రావడానికి కృషి చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హౌంమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ లోకసభ సభ్యుడు సల్లాఉద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వ ర్రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను అభినందిస్తున్నామ న్నారు. జీవో 112 ప్రకారం ఏటా 10శాతం చొప్పున ట్యూషన్ ఫీజును ప్రభుత్వం పెంచాల్సి ఉన్నా, 2014 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయకపోవడం తగదనీ, వెంటనే సీఎ కేసీఆర్ స్పందించి వెంటనే ట్యూషన్ ఫీజును పెంచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు జూని యర్ విద్యాసంస్థల గుర్తింపు, పరీక్షల ఫీజును ప్రభుత్వం ఏటా పెంచుతోందనీ, తమ ట్యూషన్ ఫీజును మాత్రం పెంపుదల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించాలని కోరారు. ఒకే భవనంలో జూనియర్ కాలేజీ, వాణిజ్య సము దాయాలుంటే కళాశాలలకు మిక్స్డ్ అక్యుపెన్సీ పేరిట అనుమతులు ఇవ్వడం లేదనీ, ఈ నిబంధనను శాశ్వతంగా తొలగించాలనీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలనూ సత్వరం విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు వరదారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు బాలకృష్ణారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, రాజనవర్దన్రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు.