Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అంబర్ పేట కార్పొరేటర్ ఇ. విజరు కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం అంబర్ పేట డివిజన్ పరిధి లోని పటేల్ బడాలో స్థానిక అధికారులతో కలిసి పాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్థాని క బస్త్తీ ప్రజలతో కలిసి డ్రయినేజీ సమస్యని పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రయినేజీ సమస్య శాశ్వత సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, మహేష్ ముదిరాజ్, రంగు ఉదయ్ గౌడ్, జమీల్, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.