Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.మనోజ్ రెడ్డి అన్నారు. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విక్రమ్ నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి బర్కత్ పుర మున్సిపల్ పార్క్ వరకు తెలంగాణ ఉచిత కంటి వెలుగు పథకంపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ తెలంగాణ కంటి వెలుగు ఆహ్వాన పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి ఉచిత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవు తుందని తెలిపారు. ఉచిత కంటి పరీక్ష శిబిరాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. శని, ఆది వారాలు, ప్రభుత్వ సెలవుల్లో ఈ శిబిరాలకు సెలవులు ప్రకటించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణలోని అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు ఏ కంటి సమస్య ఉన్నా నివారణ మార్గాలను, అత్యున్నత నాణ్యత గల వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులోకి తీసుకురావ డానికి కంటి వెలుగు ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కంటి సమస్యలు ఉన్న వారు ఉచిత కంటి పరీక్ష శిబిరాల్లో పాల్గొనవచ్చుననీ, ఉచితంగా, మందులు కండ్లద్దాలు ఇవ్వనున్నట్టు తెలి పారు. కార్యక్రమంలో డాక్టర్ ఎ.పద్మజా, డాక్టర్ సి.మాధ వి, ఏఎన్ఎంలు సుహాసిని, పద్మ, సునీత, ఆశా వర్కర్లు డి.ఉమాదేవి, పుష్పవతి, లావణ్య పాల్గొన్నారు.