Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిషన్‌రెడ్డి, తలసాని, మేయర్, జీహెచ్ఎంసీ కమిసనర్ సంతాపం
నవతెలంగాణ-మెహదీపట్నం/సిటీబ్యూరో
బీజేపీ సీనియర్ నాయకులు, గుడిమ ల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ (58) శుక్రవారం ఉదయం కన్ను మూశారు. గురువా రం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్లు చికిత్సనందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చనిపోయాడు. దేవరకరుణాకర్ గతం లో రెండుసార్లు గుడిమల్కాపూర్ కార్పొరేటర్‌గా పనిచే శారు. అతని ఆకాల మరణానికి బీజేపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని, ఎమ్మెల్యే రాజాసింగ్ సంతాపం తెలియజేశారు.
మేయర్ సంతాపం
జీహెచ్ఎంసీలోని వార్డు నెంబర్-71 (గుడిమల్కా పూర్) కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతి పట్ల మేయర్ సంతాపం వ్యక్తం చేశారు. దేవర కరుణాకర్ మరణ సమా చారం అందిన వెంటనే హుటాహుటిన సిటీ న్యూరో హాస్పి టల్‌కు వెళ్లి భౌతికకాయానికి నివాళ్లర్పించా రు. ఆయన గుడి మల్కాపూర్ కార్పొరేటర్‌గా రెండు పర్యాయాలు పనిచేసినట్టు మేయర్ తెలిపారు. కార్వాన్, నాంపల్లి కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. సీనియర్ కార్పొరేటర్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. కార్పొరేటర్‌గా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడేవారనీ, అన్ని పార్టీల కార్పొరేట ర్లతో చాలా సఖ్యతగాను, సౌమ్యుడుగాను ఉండేవారని గుర్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నూ సభ సజావుగా జరిగేందుకు సహక రించేవారని మేయర్ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు మేయర్ సానుభూతిని వ్యక్తం చేశారు.
దేవరకరుణాకర్ మృతికి కమిషనర్ సంతాపం
గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవరకరుణాకర్ మరణించడం పట్ల జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్ కుమార్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌గా రెండు పర్యాయాలు పని చేశారనీ, ఏంతో సామ్యుడుగా పేరు గాంచాడని కొనియాడారు. ఆయన మృతి బాధాకరమన్నా రు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.