Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట/ముషీరాబాద్
తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణ సాధన అనంతరం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నా రని అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని ప్రొఫెసర్ హామీ నిచ్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్ సన్, ప్రధాన కార్య దర్శిగా తెలంగాణ వెంకన్న, కోశాధికారిగా రామచందర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా శశిధర్ శిల్ప, కార్యవర్గ సభ్యులుగా బంగారం శ్రీనివాస్, శివకుమార్, అశోక్ కుమార్ ఎన్నిక య్యారు. ఈ సమావేశంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, ఉద్యమ కారులు రామగిరి ప్రకాష్, గొల్లపూడి నాగేష్, ముత్తయ్య, మాణిక్ ప్రభు, తిరుమల రావు, వాడపల్లి మాదవ్, రాజమహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.