Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్ పేట
ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు కలిశారు. రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు, తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్ వింగ్ అంబర్ పేట అసెంబ్లీ తరపున అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పార్టీ నాయకులతో పలు విష యాలు చర్చించినట్టు చెప్పారు. తాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రమే వచ్చాననీ, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడానికి కాదని చెప్పారు. ఎవరితో ఎలాంటి పొత్తు ఉండదనీ, సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు అక్కడ విద్య, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఇక్కడ కూడా మన ఊరు మనబడి, బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం చాలా బాగుందనీ, ఇది ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో కూడా అమలు చేస్తామని పేర్కొ న్నారు. అలా ఒకరి నుండి మరొకరు అభివృద్ధి ప్రణాళిక తీసుకోవడం ద్వారా దేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలుప వచ్చని కేజ్రీవాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు ఆప్ నాయకులు తెలియజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఎవరు దేనిని రాజకీయ కోణంలో ఊహించుకోవద్దని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ను కలిసిన వారిలో ఆప్ ప్రొఫెషనల్ వింగ్, అంబర్ పేట అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ హరిచరణ్, కో-కన్వీనర్ పుట్ట పాండురంగయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి వికాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ కందుల, సభ్యులు కంచర్ల అక్షయ రెడ్డి, డాక్టర్ క్రాంతి కుమార్, దాచేపల్లి సాయి సూరి, జి డి వి కృష్ణారావు, జాయింట్ సెక్రెటరీ పైలా శ్రీనివాస్, ఏటూరు పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.