Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ఖరీదుగా మారిన క్రీడలను గ్రామీణ యువతకు చేరువయ్యేలా చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ తారీకు అన్వర్ అన్నారు. గురువారం అంబర్ పేట వాటర్ వర్క్స్ 40వ రాజీవ్ గాంధీ అండర్ 19 ఇంటర్నేషనల్ క్రికెట్ ఛాంపియన్ షిప్ క్రికెట్ పోటీలను తారిక్ అన్వర్ ప్రారంభించి మాట్లాడారు. వి.హనుమంతరావు రాజీవ్ గాంధీని స్మరిస్తూ 15 ఏండ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ గ్రామీణ క్రీడాకారు లను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వి.హనుమంతరావు మాట్లాడుతూ క్రికెట్ ఆట ధనవంతులే అడగగలరనీ, తాము గ్రామీణ స్థాయి క్రీడాకారులను, వివిధ నగరాలలో క్రీడాకారులను గుర్తించి అండర్ అండర్ 17 అండర్ 19 నేషనల్ టోర్నమెంట్స్ నిర్వహించి వాళ్లకు చక్కటి వేదికనిస్తున్నామ ని తెలిపారు. మమ్మద్ సిరాజ్ హనుమాన్ విహారి శ్రీలంక నుండి కుషాల్ మెయిన్ థిస్ బంగ్లాదేశ్ నుండి లిటల్ దాస్ లాంటి క్రీడాకారులను క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా తయారుచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎఫ్ఐ సెక్రెటరీ అమర్జిత్ కుమార్, సయ్యద్ సాదిక్ పాషా, సిఎఫ్ఐ అధ్యక్షులు శంబుల శ్రీకాంత్ గౌడ్, ఆది అవినాష్, పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.