Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
కంటి వెలుగు కార్యక్రమం పేదలకు సువర్ణావకాశం వంటిదని, ఇలాంటి వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతనాయక్ అన్నారు. డివిజన్ పరిధిలోని పద్మపాణి ఆచార్య భవనంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, ఈ.ఈ కోటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపు తక్కువ ఉన్నవారు, కంటి సమస్యలు ఉన్నవారు కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకావాలన్నారు. కార్యక్రమంలో ఏఈ హేము నాయక్, శానిటేషన్ డీఈ వెంకటేశ్, సూపర్వైజర్ గణేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఎన్ రెడ్డి నగర్లో..
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ శ్రీ సీతారామాంజనేయ కల్యాణ మండపంలో, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ ఫేజ్ 2 కాలనీ సంక్షేమ సంఘం భవనంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో చేనేత మోర్చా కన్వీనర్ రఘురాం నేత, పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, కంటి వెలుగు ఇన్చార్జ్ వెంకట్ రెడ్డి, అనిల్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఎస్ఎస్ అజీమ్, జవాన్ పి. లక్ష్మయ్య,. ఎస్ఎఫ్ఏ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.