Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి చూపు మెరుగుపడేందుకే కంటివెలుగు
- కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల కంటిచూపు మెరుగుపడేందుకే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీ 1వ వార్డు కొండాపూర్లోని కమ్యూనిటీ హాల్లో రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మురళి పావని జంగయ్య యాదవ్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, వైస్ చైర్మెన్ పలువుల మాధవరెడ్డి, కమిషనర్ వేమన రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొంత అంజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, చిలుకూరు హేమలత గోపాల్ రెడ్డి, కొమ్మగోని రమాదేవి, బండారు ఆంజనేయులు గౌడ్, మల్లేష్, జహంగీర్, బేతల నర్సింగ్ రావు, కుతాది రవీందర్, సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోచారం మున్సిపల్ పరిధిలో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపల్ పరిధి ఇస్మాయిల్కన్ గూడ ఒకటో వార్డులో రెండో దశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చైర్మెన్ కొండల్ రెడ్డి వైస్ చైర్మెన్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్స్ గోంగల్లా మహేష్, చింతల రాజశేఖర్, సింగిరెడ్డి సాయిరెడ్డి, భైర హిమా, మెట్టు బల్ రెడ్డి, బాలగొనీ వెంకటేశ్ గౌడ్, బెజ్జాంకి హరి ప్రసాద్, సుర్వి రవీందర్, కో ఆప్షన్ సభ్యులు అక్రమ్ అలీ, మేనేజర్ నరసింహులు, సహకార బ్యాంక్ మాజీ చైర్మెన్ గొంగోల స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.