Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8, 14వ డివిజన్లలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు తరహా కార్యక్రమం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. బాధితులకు అక్కడికక్కడే ఉచితంగా కంప్యూటరైజ్డ్ పరీక్షలు, మందులు, కళ్లద్దాలు పంపిణీతో పాటు పరీక్షలు అనంతరం అవసరమైన వారికి ఆపరేషన్లకు కూడా రికమెండ్ చేసి వాటిని కూడా సంబంధిత ఆసుపత్రులలో చేయిస్తారన్నారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ డా. పి.రామకష్ణ రావు, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి, పాశం శశిరేఖ బుచ్చియాదవ్, సుభాష్ నాయక్, అనంత రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు నజియా, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, బండారి రవీందర్, తూముకుంట్ల శ్రీధర్ రెడ్డి, డాక్టర్ ప్రతిభ, డీఈఈ శ్రీనివాస్, మేనేజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఉమర్ఖాన్ గూడలో
తుర్కయాంజల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తుర్కయాంజల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనూరాధ రాంరెడ్డి అన్నారు. గురువారం ఉమర్ఖాన్ గూడలో కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్ కుమార్తో కలిసి కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, డీఈ సత్యనారాయణ, కాంగ్రెస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోశికే ఐలయ్య, కౌన్సిలర్లు మర్రి మాధవి మహేందర్, కుంట ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, నక్క శివలింగం, కొండ్రు మల్లేష్, కోఆప్షన్ సబ్యులు కాకుమాను మరియమ్మ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.