Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-హయత్నగర్
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ సంక్షేమ భవనం వద్ద కంటి వెలుగు శిబిరాన్ని కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వెంట ఆధార్ కార్డు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్, డాక్టర్ పులేందర్ నాయుడు, భవానీనగర్ కాలనీ సంక్షేమ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్లో..
హయత్నగర్ డివిజన్లోని నూతన వార్డు కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం వంద రోజులపాటు ప్రతిరోజు ఉదయం 9. 00 గంటల నుంచి సాయంత్రం 4.00 వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రేయ, సూపర్వైజర్ వెంకటాచారి, వైద్య సిబ్బంది మాధవి, మంజుల, వినోద, పార్వతి, ఆశావర్కర్స్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.