Authorization
Wed March 12, 2025 10:01:30 am
- మార్గదర్శకంగా ముస్లిం శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కర్తలు
- ఆకట్టుకున్న విద్యార్థుల క్రియేషన్లు
నవతెలంగాణ-అంబర్‌పేట
స్ప్రింగ్‌ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఇస్లామిక్ శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కర్తలపై టోలీచౌకిలోని మెజెస్టిక్ గార్డెన్స్‌లో ఇస్లామిన్ స్వర్ణ యుగం పేరుతో ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం మొదటి రోజు ప్రదర్శన జరిగింది. 8వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్య కాలం మానవజాతి చరిత్రలో ఆర్థిక, సాంస్కతిక, వైజ్ఞానిక వికాసానికి విశేషమైన కాలమే ఇస్లాం స్వర్ణయుగం. ఇస్లాం పెరుగుదల, వ్యాప్తి ఒక గొప్ప శాస్త్రీయ, మేధో విప్లవాన్ని ప్రేరేపించింది. ముస్లిం శాస్త్రవేత్తలు గణితశాస్త్రం, వైద్యం, ఖగోళ శాస్త్రం, ఆప్టిక్స్, రసాయన శాస్త్రంలో గణనీయమైన అభివృద్ధిని సాధించా రు. కానీ 800 ఏండ్ల ఈ గొప్ప వారసత్వం యూరో-కేంద్రీకృత సంస్కతితో కప్పివేయబడింది. ఇస్లాంకు సంబంధించిన చాలా ఆవిష్కరణలు ఈ రోజు ప్రజలకు చాలా తక్కువ మందికే తెలుసు. ఈ నేపథ్యంలో స్ప్రింగ్ ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ ముస్లిం శాస్త్రవేత్తల సహకారం, గణితం, సైన్స్, లాంగ్వేజ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, లైఫ్‌స్టైల్ రంగాల్లో వారి ఆవిష్కరణలను మోడల్స్, కళాఖండాలు, విద్యార్థుల ప్రదర్శనలను గ్రాండ్ ఎగ్జిబిషన్ రూపలోం ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్‌ను యునెస్కో మాజీ అధ్యక్షుడు అష్గర్ హుస్సేన్, తెలంగాణ ప్రభుత్వ టీఎంఆర్ఈఐఎస్ అకాడ మిక్ హెడ్ ఎంఎ.లతీఫ్ అటెర్, స్ప్రింగ్‌ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ అంజుమ్ బాబుఖాన్, జయాన్ బాబుఖాన్ ప్రారంభించారు. స్ప్రింగ్‌ఫీల్డ్స్ డైరెక్టర్ డాక్టర్ అంజుమ్ బాబుఖాన్ ఆలోచన, అతీర్ మద్దతుతో నిర్వహించారు. ఈ సందర్భంగా మిస్టర్ అష్గర్ హుస్సేన్ విద్యార్థుల విస్త్రృత పరిశోధన, ప్రదర్శనను ప్రశంసించి మాట్లాడారు. మన గొప్ప వారసత్వం గురించి మనం గర్వపడాలన్నారు. ఈ వారసత్వానికి మనం కనెక్ట్ అవ్వాలనీ, కమ్యూనికేట్ చేయాలనీ, సహకరించాలన్నారు. లతీఫ్ అటెర్ తన పరిశోధన గురించి మాట్లాడుతూ ముస్లిం శాస్త్రవేత్తలపై మొట్టమొదటి ప్రదర్శన చేయడానికి మా దివంగత వ్యవస్థాపక డైరెక్టర్ బషీరుద్దీన్ బాబుఖాన్ తనను ప్రేరేపించారనీ, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేక ప్రదర్శనలను మెరుగుపరచడం, నిర్వహించడం కొనసాగించారు. ప్రదర్శనకు 60కి పైగా పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్లో అన్ని వర్గాల ప్రజలు, వయస్సు వర్గాల ప్రజలు పాల్గొనవచ్చు.