Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
పరిశుభ్రతపై దృష్టి సారించాలనీ, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి ఎస్ఎఫ్ఐలను గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గోల్నాక డివిజన్ పరిధిలోని గంగానగర్ కమలానగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఈ సందర్భంగా రోడ్ల పైన ప్రభుత్వ స్కూల్ దగ్గర చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని అధికారులను సూచించారు. చుట్టుపక్కల ప్రజలు కూడా అధికారులకు జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలనీ, రోడ్ల పైన చెత్త వేయకుండా చెత్త ఆటోలలో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే బాబు, బి.నర్సింగ్ యాదవ్, లక్ష్మణ్‌గౌడ్, గాజుల గోపాల్, నర్సింగ్ యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.