Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస గుప్తా
నవతెలంగాణ-ధూల్‌పేట్
సిటీ కళాశాల పురోభివృద్ధికి పూర్వ విద్యార్థులందరూ పునరంకితం కావాలని పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస గుప్త్తా అన్నారు. కళాశాల ఆలుమ్ని కమిటీ, ఐక్యూఏసి సంయుక్తంగా ''నూతన విద్యా విధానం 2020-ఉన్నత విద్యా సంస్థలలో స్థిరమైన శ్రేష్ఠత సాధనలో పూర్వ విద్యార్థుల పాత్ర-అవకాశాలు, సవాళ్లు'' అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులో ఉప్పల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను కేబినెట్ హౌదా కలిగిన పదవిలో ఉన్నపటికీ సిటీ కళాశాల పూర్య విద్యార్ధినని చెప్పుకోవడానికి గర్విస్తానని తెలిపారు. వందే ండ్ల ఘన చరిత్ర గల సిటీ కళాశాల దేశంలో సమున్నత విద్యాసంస్థ అని కొనియాడారు. ప్రయివేటు కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థుల కంటే ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు బహుముఖీన రంగాల్లో ప్రతిభవం తులుగా రాణిస్తారని చెప్పారు. విద్యార్థులు జ్ఞానార్జనతో పాటు క్రీడా సాంస్కతిక రంగాల వైపు కూడా దృష్టి సారించి తద్వారా జీవితంలో ఉన్నతిని సాధించాలని సూచించారు. పర్యాటక రంగంలో ఉన్న విస్త్రతమైన ఉపాధి అవకాశాలను విద్యార్థులు అంది పుచ్చుకోవటానికి సంబంధిత కోర్సులను శ్రద్ధగా అభ్యసించాలన్నారు. పర్యాటక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన విధానాన్ని అమలు చేస్తున్నదనీ, ఇది మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. సిటీ కళాశాలకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా, తాను ముందు నిలిచి కళాశాల ప్రగతికి దోహదపడతానని హామీనిచ్చారు. నూతన విద్యావిధానం-పూర్వ విద్యార్థుల పాత్రపై ప్రత్యేకంగా జాతీయ సదస్సును నిర్వహించటం అభినందనీయమన్నా రు. ఈ సదస్సులో పూర్వ విద్యార్థులైన సీనియర్ ఆచార్యులు వెంకట రాజాం, హైకోర్ట్ పూర్వ రిజిస్ట్రార్ విద్యాధర్ భట్ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్య సంరక్షణకు శ్రద్ద వహించాలని యోగా గురువుగా దేశవిదేశాలలో రాణించిన వెంకట రా జాం అన్నారు. తాను ఈ ఘనత సాధించటానికి సిటీ కళాశాల ఎంతో దోహదం చేసిందనీ, ఈ కళాశాల పునరుద్ధ రణకు పూర్వ, ప్రస్తుత విద్యార్థులు పూనుకోవాలన్నారు. ప్రస్తుతం సిటీ కళాశాల పూర్వ విద్త్యార్తుల సంఘ బాధ్యు లుగా ఉన్న విద్యాధర్ భట్, సంఘాన్ని బలోపేతం చేయ టానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని హామీనిచ్చారు. ఈ ప్రారంభ సభకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పి.బాల భాస్కర్ అధ్యక్షత వహించిన సదస్సులో మాజీ శాసన సభ్యులు ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ పాత్రికేయులు, రచయిత మందల పర్తి కిశోర్, సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు పాశం యాదగిరి, సిటీ కళాశాల పూర్వ అధ్యాపకులు, రచ యిత్రి డాక్టర్.పరిమళా సోమేశ్వర్ తదితరులు ప్రసంగిం చారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి వచ్చిన ఆచార్యులు, అధ్యాపకులు పరిశోధనా పత్రాల ను సమర్పించారు. సాంకేతిక సదస్సులను డాక్టర్.శ్రీనివాస్, డాక్టర్.శంకర్ కుమార్ సమన్వయం చేశారు. ఈ సదస్సులో సంచాలకులు డాక్టర్.పావని, డాక్టర్.భాస్కర్, డాక్టర్. ఝాన్సీ, డాక్టర్.కోయి కోటేశ్వర రావు, డాక్టర్.శారద తదితరులు పాల్గొన్నారు.