Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షురాలు మీనా
- వీధి వ్యాపారుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కోఠి సుల్తాన్ బజార్ వీధి వ్యాపారాలపై పిట్టి కేసులను ఆపాలని సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షురాలు మీనా డిమాండ్ చేశారు. శుక్రవారం వీధి వ్యాపారస్తుల దినోత్సవం సందర్భంగా కోఠి సుల్తాన్ బజార్లో ర్యాలీ నిర్వహించారు. వీధి వ్యాపారులపై ట్రాఫిక్ పోలీస్ వేధింపులు ఆపాలనీ, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం విడనాడాలన్నారు. 2014 చట్టం ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీ ఆధ్వర్యంలో చట్టంలో ఉన్నట్టు నిర్ణయం చేయాలన్నారు. మెట్రో లైన్ వాళ్ళు నెలకి రూ.4.500 రెంటు బలవంతంగా వసూలు చేస్తున్నారనీ, రెంటు తీసుకుని వీళ్ళకి కరెంటు సౌకర్యం, వాటర్ సౌకర్యం లాంటివి కల్పించడం లేదన్నారు. లాటరీ సిస్టంగా స్టాల్స్ నామినల్‌గా ఏర్పాటు చేశారు. చిరు వ్యాపారం చేసుకునే ప్రతి కార్మికునికీ స్టాల్స్ ఏర్పాటు ప్రభుత్వమే దగ్గర ఉండి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీరిపై విపరీతంగా పిట్టి కేసులు, చలాన్లు వేయవద్దనీ, అవుట్ సైడ్ జాబ్ చేసుకునే వారికి స్టాల్స్ ఇవ్వడం చాలా దుర్మార్గం అన్నారు. అర్హులైన వారిని గుర్తించి అక్కడ వ్యాపారం ఏండ్లుగా చేసుకుంటూ స్టాల్స్ లేని వాళ్ళందరికీ వెంటనే స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ, వ్యాపారస్తులకి టీవీసీ సమావేశం లేకుండా నిర్ణయించరాదనీ, వెండింగ్ జోన్‌కి ఏర్పాటు చేయాలనీ, వెండింగ్ సర్టిఫికెట్లు కలిగి ఉన్న విక్రయి తలను వేధించటం లేదా తొలగించటం ఆపాలనీ, విక్రయితలు అందరికీ వెల్డింగ్ సర్టిఫికెట్ జారీ చేయాలనీ, ఏదైనా వాణిజ్య పరిష్కారం పై వీధి వ్యాపారులకు మొదటి హక్కు ఉండేలా చూడాలనీ, చిరు వ్యాపారస్తులందరికీ లేబర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.