Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
బోరబండ బస్టాండ్ నుంచి సైట్ 3 వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా, అక్రమంగా పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను ఎస్సార్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సురేష్, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు తనిఖీలు చేసి, అక్రమ వాహనాలు పార్కింగ్ చేసే యజమానులపై చర్యలు తీసుకు న్నారు. తాళాలు వేసి ఉన్న వాహనాలను క్రేన్ సాయంతో ప్రత్యేక వాహనంలోనికి తరలించి స్టేషన్కు తరలించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలనీ, వాహనాలు పార్కింగ్ స్థలాలలో మాత్రమే పెట్టుకోవాలనీ, రోడ్డు పక్కన పెడితే జరిమానాలు విధిస్తామని వాహనదారులను హెచ్చరించారు.